Thursday, September 23, 2010
పరిచయం
శ్రీకృష్ణదేవరాయలవారి భువనవిజయమందు గల అష్టదిగ్గజాలలో ఒకరైన తెనాలిరామకృష్ణుడు మధ్యభారత ఇతిహాసం లో తెలుగు జాతి పొందిన మహా ప్రసాదం.
తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయల వారి ఆస్థానములోని కవీంద్రులు.స్మార్త శాఖలోని నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు. ఈయనని తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు. అవిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్ర లో ఈయన ప్రముఖులు. తొలుత సాధారణ వ్యక్తి అయిన రామకృష్ణులు, కాళీమాత వర ప్రసాదం చేత కవీశ్వరులయ్యారు. గొప్ప కావ్యాలు విరచించారు. కానీ తెలుగు వారికి ఆయన ఎక్కువగా హాస్య కవిగానే పరిచయం. ఆయనకు వికటకవి అని బిరుదు కలదు. ఆయనపై ఎన్నో కథలు ఆంధ్ర దేశమంతా ప్రాచుర్యములో కలవు.మొదట్లో రామకృష్ణుడి ఇంటి పేరు గార్లపాటి అని, తెనాలి నుండి వచ్చినారు కనుక తరువాతి కాలంలో తెనాలి అయినది అని ఒక నానుడి. సత్తెనపల్లి మండలంలోని లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య, లక్ష్మాంబల సంతానం రామలింగయ్య. ఆయన తాత సుదక్షణా పరిణయం రాసిన అప్పన్న కవి. వీరికి ఇద్దరు సోదరులు వరరాఘవకవి, అన్నయ్య. రామలింగయ్య తాత,ముత్తాతలు గార్లపాడు లోనే నివసించారు. ప్రస్తుతం గ్రామ బొడ్రాయి ప్రతిష్ఠించిన ప్రాంతంలోనే రామకృష్ణుల వారి ఇల్లు ఉండేదని గ్రామస్తుల నమ్మకం. క్రీ.శ. 1514 నుంచి 1575 వరకు రామలింగయ్య జీవించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో మేనమామ తెనాలి అగ్రహారమైన తూములూరు కు తీసుకువెళ్లారు. అక్కడే వారి సంరక్షణలో విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. (పై లైన్లను తెవికీ నుండీ నేరుగా నకలు చేసి అతికించాను ఆ పేజీ యొక్క లింకు)
ప్రకరణము
శ్రీ రామ పరబ్రహ్మణే నమః
శ్రీ మతే రామానుజాయ నమః
మన భారత దేశం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన నాగరికతను కలిగియుంది. మన దేశం ఎన్నో రకాల కళలకూ, భాషలకు, సంస్కృతులకు నిలయం. మరి ఏ ఇతర సంస్కృతీ మనకు ఏ విషయంలోనూ సాటి రాదు. మన కట్టూ-బొట్టూ, మన ఆహార-వ్యవహారాలూ, మన జ్ఞాన సంపద, మన ఆధ్యాత్మిక దృష్టికోణం, మన మామిడి పళ్ళూ , మన గుళ్ళూ , ఇంకెక్కడ ఈ వైవిధ్యం , ఇంకెక్కడ ఈ స్వేచ్ఛ?
వేదపురాణ్యితిహాసోపనిషత్తుల్లోని ప్రాచీన జ్ఞానం మన ఆలోచనా విధానాలకు ఒక ఒరవడిని అందిస్తాయి. ఎప్పటికప్పుడు మనం ఆయా స్మృతి శృతి శాస్త్రాలను సాయిస్తే మనకు కర్తవ్యబోధ తనంతట తనే అవుతుంది. పాశ్చాత్య సంస్కృతీ సంప్రదాయాల్లో మనం పూర్తిగా మునిగిపోక ముందే మనల్ని మనం మళ్ళీ తెలుసుకుందాము. గతం గతః మా తాతలు నేతులు నాకారు మా మూతులు నాకండి అంటూ ప్రగల్భాలు పలకమన్నది ఇక్కడి ఉద్దేశ్యం కానే కాదు.
మనకు మన పూర్వీకులు ఇచ్చిన అద్భుత సంపదను కాపాడుదాం ఆచరిద్దాం మన ముందు తరాలవారికి మరి కొంచెం మెరుగు పరిచి అందిద్దాం. ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్ మాది న్యూ జెనరేషన్ మేమింతే అనే వారికై ఈ బ్లాగు రాయబడటం లేదు. ఇక్కడ ఇవ్వబడిన నీటి వాక్యాలను అలవరుచుకుని తమతమ జీవితాలను మెరుగుపర్చుకునే వారి కోసమే ఈ బ్లాగు.
విదుర, కౌటిల్య, మనువు, సర్వజ్ఞ, వేమన, శ్రీనాథ, తెనాలి రామకృష్ణ వంటి మహాపురుషులేందరో జనించిన ఈ దేశంలో. మనం వారి తత్వాలను పట్టించుకోకుండా అరకొర పాశ్చాత్య సిద్ధాంతాలకు తలవంచుతున్నాము.
అందువల్ల మనకు తీరేదేమి లేదు. గమనించండి సిద్ధాంతాలు ఆయా ప్రాంతాల భౌగోళిక సాంస్కృతిక అంశాల పై ఆధారపడి ఉంటాయి అంచేత పాశ్చాత్య ధోరణులు మంకు పడొచ్చు పడకపోవచ్చు
ఇక అసలు విషయానికొస్తే ఈ పూర్తీ బ్లాగును నేను మా అమ్మగారి కులోద్ధారకుడు అయిన తెనాలి రామకృష్ణ వారి కథలకు సమర్పిస్తున్నాను
Subscribe to:
Comments (Atom)